Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనవతెలంగాణ 
దినదినాభివృద్ధి చెందాలి

నవతెలంగాణ 
దినదినాభివృద్ధి చెందాలి

- Advertisement -


అడిషనల్ కలెక్టర్ భుజంగరావు
నిజామాబాద్‌‌లో 11వ వార్షికోత్సవ 
సంచిక ఆవిష్కరణ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి

నవతెలంగాణ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆకాంక్షించారు. పత్రిక 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సంచికను కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో పద్మశ్రీతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రిక పాఠకులకు, విలేకరులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌వో పీఆర్‌వో జావిద్, నవతెలంగాణ నిజామాబాద్‌ రీజియన్ మేనేజర్ అనంతుల సురేశ్, ప్రాంతీయ ప్రతినిధి మీస మధు, డివిజన్ ఇన్‌చార్జీలు కర్రొల్ల గోపి, ఆరె నవీన్‌కుమార్, సంతోష్, బాల్కొండ విలేకరి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -