Monday, September 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాహ్య మూల్యాంకనం విధానాన్ని ఉపసంహరించుకోవాలి

బాహ్య మూల్యాంకనం విధానాన్ని ఉపసంహరించుకోవాలి

- Advertisement -


ఎస్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

బాహ్య మూల్యాంకనం విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు. ఈ విధానం సీసీఈ విధానానికి విరుద్ధమని వారు తెలిపారు. విద్యార్థులను ప్రత్యక్షంగా బోధించే ఉపాధ్యాయులే వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం వల్ల విద్యార్థుల అభ్యసన లోపాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, తదుపరి బోధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బాహ్య మూల్యాంకనంతో మూల్యాంకనం–బోధన మధ్య ఉన్న అనుసంధానం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -