- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ బీడీ అండ్ సిగార్ పర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె గోపాల స్వామి, ఎస్వీ రమ తిరిగి ఎన్నికయ్యారు. ఆ సంఘం రాష్ట్ర నాలుగో మహాసభను ఆగస్టు 30న సిద్దిపేటలో నిర్వహించారు. ఈ సందర్బంగా నూనత కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కోశాధికారిగా బి బాలమణి, ఉపాధ్యక్షులుగా కె చంద్ర శేఖర్, జి భాస్కర్,మోహన్,ఎంఏ చౌదరి,సూరం పద్మ,పుష్ప, కార్యదర్శులుగా సత్యం,శోభ,ఎస్ రాజు, ఐ సులోచన, ఇద్దరు కో-అప్షన్‌తో పాటు మరో 30మందిని సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



