కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి

 – కలెక్టర్ హరిచందన  దాసరి
 నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి లో ఉన్న  గోదాములో ఏర్పాటు చేయనున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె జిల్లా ఎస్పీ చందన దీప్తి, రెవెన్యూ అదనపు  కలెక్టర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులతో కలిసి అని శెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసే కౌంటింగ్ కేంద్రంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూములను సైతం ఈ కేంద్రంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇదివరకే 6 స్ట్రాంగ్ రూములు ఉండగా మరో స్ట్రాంగ్ రూమును ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాయక్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డిఈ నాగయ్య, ట్రాన్స్కో అధికారులు, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
Spread the love