జిల్లా స్థాయి స్పెల్ విజార్డ్ లో విద్యార్థిని నీల పావని ప్రతిభ

నవతెలంగాణ – గాంధారి

జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పెల్ విజార్డ్ మరియు డ్రామా పోటీలను ఘనంగా నిర్వహించారు. స్పెల్ విజార్డ్ లో గాంధారి ఉన్నత పాఠశాల విద్యార్థిని నీల పావని ప్రథమస్థానం పొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికయింది. గెలుపొందిన విద్యార్థిని నీలపావని ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ రాజు  అభినందించి ప్రశంస పత్రం అందించారు. గైడ్ టీచర్ ఎస్. కే.మన్సూర్, ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగా వెంకటేశ్వర్ గౌడ్   విద్యార్థిని నీల పావని ను అభినందించారు. ఈ విజయం పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తంచేశారు గ్రామస్తులు అభినందించారు.

Spread the love