- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల నీట్ అభ్యర్థి పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం, కొన్నేళ్లుగా నీట్ కోసం సిద్ధమవుతున్న ఆమె పరీక్ష రద్దుతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలకు తరలించగా, శ్మశానవాటిక నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



