Wednesday, June 10, 2026
E-PAPER
Homeజాతీయంప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఆదివార మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ కోసం ఎన్‌టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద డ్రెస్ కోడ్‌తో పాటు, ఇతర నిబంధనలను కఠినంగా అమలు చేశారు. అడ్మిట్ కార్డు, ఫొటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -