నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మలబార్ గోల్డ్ డైమండ్స్ యూఏఈలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో ‘నువ’ పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు. ప్రఖ్యాత భారత సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ ‘నువ’ కలెక్షన్ ను ఆవిష్కరించారని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాలాతీత గాంభీర్యానికి పేరు గాంచి, ‘నువ’ సేకరణకు ప్రతిబింబంగా నిలిచే కరీనా కపూర్ ను ఈ సేకరణల ప్రారంభానికి అంబాసిడర్ గా ఉన్నారన్నారు. ఇకపై భారతదేశంలోని అన్ని షోరూముల్లో ‘నువ’ సేకరణ అందుబాటులో ఉన్నాయన్నారు. యూఏఈ లోని మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూములో అధికారికంగా ప్రారంభించిన తర్వాత, మలబార్ షోరూములో ఈ సరికొత్త కలెక్షను ఆవిష్కరించబడుతాయన్నారు. ప్రకృతి ప్రసాదించిన సంక్లిష్టమైన ఆకృతులు, అలలు, వివిధ రూపాలు, మడతలు , అల్లికల నుండి ప్రేరణ పొంది, విలాసవంతమైన వజ్రాభరణాలుగా అద్భుతంగా రూపొందించబడిన ఒక వేడుక ఈ ‘నువ’ సేకరణ అన్నారు. సహజ ప్రపంచంలో కనిపించే గాంభీర్యం నుండి ప్రేరణ పొందడం ద్వారా సేకరణలోని ప్రతి అంశం ఎంతో సూక్ష్మంగా రూపొందించబడింది, శుద్ధి చేయబడిందన్నారు. జీవితంలోని హెచ్చుతగ్గులను సమపాళ్లలో తీసుకునే పరిపూర్ణ మహిళ వలె అద్భుతమైన, క్లిష్టమైన కళాకృతిగా ఉద్భవించేలా తయారు చేయబడిందని తెలిపారు. వారు కంటున్న కలలలో వారెప్పుడూ ఉన్నతంగా స్థిరంగా నిలబడి ఉంటారని, స్త్రీలలో మూర్తీభవించిన గాంభీర్యం, బలం మరియు దయకు ప్రతి ఆభరణం నిదర్శనంగా నిలబడుతుందన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ ప్రకృతి మహిళల అలుపెరగని స్పూర్తి ఈ రెండింటినీ వేడుకగా జరుపుకునే ‘నువ’ సేకరణ పరిచయం చేయడం మాకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సేకరణలోని ప్రతి భాగం అపారమైన శ్రద్ధ ఖచ్చితత్వంతో రూపొందించబడిందని, ఇది ప్రకృతి యొక్క క్లిష్టమైన అందాన్ని మహిళల మనోభావాలను ప్రతిబింబిస్తుందన్నారు. మలబార్ గోల్డ్, డైమండ్స్లోలోని అన్ని వజ్రాభరణాల మాదిరిగానే, నువ సేకరణలు కూడా బాధ్యతాయుత మూలాల నుండి సేకరించబడిన సహజ వజ్రాలు, ఇవి పరీక్షించబడిన , ధృవీకరించబడినవి, 100 శాతం మార్పిడి విలువతో, 100 శాతం పారదర్శకతతో, బైబ్యాక్ గ్యారెంటీ వంటి మలబార్ వాగ్దానాల హామీతో లభిస్తున్నాయి.
మలబార్ గోల్డ్ డైమాండ్స్ లో ‘నువ’ ఆవిష్కరణలు
8:19 pm