నయా సైకలాజికల్‌ థ్రిల్లర్‌

నయా సైకలాజికల్‌ థ్రిల్లర్‌హీరోలు ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య నటిస్తున్న సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్‌ వర్మ నిర్మాతగా వ్యవహరి స్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలతో స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది..ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్‌ చెబుతోంది.

Spread the love