ఎల్‌ఐసీ నుంచి కొత్త ‘స్మార్ట్‌ పెన్షన్‌ ప్లాన్‌’

New 'Smart Pension Plan' from LIC– మరుసటి నెల నుంచే పెన్షన్‌
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) స్మార్ట్‌ పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్‌ను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రెటరీ ఎం నాగరాజు, ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధా ర్థ్‌ మొహంతి ఆవిష్కరించారు. పాలసీదారులకు ఈ పథకం పెన్షన్‌, ఉమ్మడ ిగా వివిధ రకాల ఆప్షన్స్‌ అందిస్తుందని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఈ పాలసీ నిబంధనల ప్రకారం పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణకు అనేక నగదు ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయని ఎల్‌ఐసీ వెల్లడించింది. స్టాక్‌ మార్కెట్ల ఒడి దుడు కులకు సంబంధం లేదని.. సొమ్ముకు గ్యారంటీ ఉంటుంది. సింగిల్‌ ప్రీమి యంతో జీవితాంతం పెన్షన్‌ పొందడానికి వీలుంది. వార్షికంగా, ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ యాన్యుటీ చెల్లింపులు పొందొచ్చు. కొన్ని షరతుల కు లోబడి పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకునే సదుపాయం ఉంది. అత్యవసరంలో రుణం పొందవచ్చు. 18 నుంచి 100 ఏండ్లలోపువా రు ప్లాన్‌ను తీసుకోవచ్చు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికో సారి చొప్పున పాలసీదారుడు యాన్యుటీ చెల్లింపుల ఆప్షన్‌ ఎంచుకో వచ్చు. కాగా.. కనీస పెట్టుబడి రూ.1 లక్షగా నిర్ణయించింది. పాలసీ తీసుకున్న తర్వాత నెల నుంచే పెన్షన్‌ వచ్చేలా ఆప్షన్‌ ఎంచుకోవడానికి వీలుంది.

Spread the love