బీఓబీ నుంచి కొత్త స్వ్కేర్‌ డ్రైవ్‌ ఎఫ్‌డీ స్కీమ్‌

New Square Drive FD scheme from BOBహైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కొత్తగా ‘బీఓబీ స్వ్కేర్‌ డ్రైవ్‌ డిపాజిట్‌ స్కీమ్‌’ను ప్రవేశపెట్టినట్టు సోమవారం ఆ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఏప్రిల్‌ 7 నుంచి అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. ఈ పథకంలో రూ.3 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవడానికి వీలుందని వెల్లడించింది. ఇందులోని 444 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలకు గరిష్టంగా 7.75 శాతం వడ్డీ రేటు అందించనున్నట్టు తెలిపింది. సాధారణ ఖాతాదారులకు 7.15 శాతం ప్రారంభం వడ్డీ ఉంటుందని వెల్లడించింది. మరో ప్లాన్‌ ఉత్సవ్‌ స్కీమ్‌ను రద్దు చేసి.. ఈ కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ఆవిష్కరించినట్టు పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఈ స్కీమ్‌ను డిజైన్‌ చేసినట్టు పేర్కొంది.

Spread the love