– ఎలాంటి అంతర్గత ఫిర్యాదులూ లేవు : టీసీఎస్ ప్రాథమిక విచారణలో కీలక వివరాలు
నాశిక్ : నిదా ఖాన్ హెచ్ఆర్ మేనే జర్ కాదని టీసీఎస్ వెల్లడించింది. నాశిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, లైంగికదాడి, బలవంతపు మత మార్పి డుల ఆరోపణల నేపథ్యంలో నిదా ఖాన్ పై కేసులు నమోదైన విషయం విది తమే. దీంతో టీసీఎస్ తన ప్రాథమిక విచారణలో కీలక వివరాలు వెల్లడిం చింది. తమ అంతర్గత వ్యవస్థల్లో ఇలాం టి ఫిర్యాదులేవీ లేవని వివరించింది. తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదై కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో… టీసీఎస్ ప్రాథమిక అంతర్గత పరిశీలన లో బాధితుల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులూ తమ ఎథిక్స్, ‘పోష్’ ఛానళ్లకు రాలేదని తెలిపింది. ఈ మేరకు టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతి వాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ”ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతు న్నప్పటికీ.. నాశిక్ యూనిట్‌కు సంబం ధించి మా సిస్టమ్స్, రికార్డుల ప్రాథమిక సమీక్షలో ఆరోపణల స్వరూపానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు” అని పేర్కొ న్నారు. ఆది వారం నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీసీఎస్.. సోమవారం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. టాటా సన్స్ చైర్మెన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటిం చినట్టుగా.. టీసీఎస్ సీఓఓ, ప్రెసిడెంట్ ఆరతి సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగు తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. ఎనిమిది మంది మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారం గా తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యా యి. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశంలో వస్తున్న ఆరోపణలను టీసీ ఎస్ ఖండించింది. ”మీడియాలో హెచ్ ఆర్ మేనేజర్‌గా పేర్కొంటున్న నిదా ఖాన్.. హెచ్ఆర్ మేనేజర్ కాదు, నియా మకాల బాధ్యతలూ చేపట్టలేదు. కేవలం ప్రాసెస్ అసోసియేట్‌గా పని చేసింది. ఆమెకు ఎలాంటి నాయ కత్వ బాధ్యతలు లేవు” అని కృతివాసన్ వివరించారు.
రాజకీయ ప్రేరేపిత కుట్ర
ఇతర అంశాలను కప్పిపుచ్చేందుకే..: నిదాఖాన్ తల్లిదండ్రులు
నాశిక్ టీసీఎస్‌లో లైంగివేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌పై నమోదైన కేసు పూర్తిగా తప్పుడు, రాజకీయంగా ప్రేరేపిత కుట్రగా ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. టీసీఎస్ నాశిక్ బీపీఓ యూనిట్లో హెచ్ఆర్ హెడ్‌గా పని చేసినట్టు గుర్తింపు పొందిన నిదా ఖాన్‌పై వచ్చిన ఆరోపణలను ఆమె తండ్రి పూర్తిగా ఖండించారు. తన కుమార్తెను లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నారని ఓ ఆంగ్ల వార్త ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.
ఆమె కుటుంబీకుల ప్రకారం… ఈ కేసు వేరే అంశాలను కప్పిపుచ్చేందుకు సృష్టించారు. ఇటీవల లైంగికదాడి ఆరోపణలపై అరెస్టయిన స్వయంప్రకటిత దైవాంశ సంభూతుడు అశోక్ ఖరత్‌కు సంబంధించిన వివాదం విషయంలో దృష్టి మరల్చడానికే ఈ కుట్ర. నిదా ఖాన్‌పై వచ్చిన ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు, మామయ్యలు ఖండించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో నిదా మాట్లాడిన సందర్భమే లేదని వారు తెలిపారు. ప్రస్తుతం నిదా ఖాన్ భివండిలోని తన అత్తింట్లో ఉన్నారని కుటుంబం తెలిపింది. ఆమె గర్భవతి అనీ, ఈ ఆరోపణల కారణంగా కుటుంబం మొత్తం మానసికంగా క్షోభకు గురైందని చెప్పారు. అలాగే నిదా ఎవరినీ మతమార్పిడికి ఒత్తిడి చేయలేదనీ, ఇతర మతాల దేవతల గురించి అవమానకర వ్యాఖ్యలు చేయలేదనీ, తమ కుటుంబం అన్ని మతాలనూ గౌరవిస్తుందని తెలిపారు. కాగా నిదా ఖాన్ భర్తను నాశిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. గత రెండు నెలలుగా ఆమె తన భర్తతో కలిసి ముంబ్రాలో నివసిస్తున్నట్టు తెలిసింది.
నిదాఖాన్ హెచ్ఆర్ కాదు
- Advertisement -
- Advertisement -



