బాధితులకు నిత్యవసర సరుకులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు నితిన్..

నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన బోయి సత్తెమ్మ, సాయిలు కు చెందిన నివాసపు గుడిసె దగ్ధం కాగా, అట్టి కుటుంబానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లచ్చే వార్ నితిన్ నిత్యవసర సరుకులను అందజేశారు. గురువారం షార్ట్ సర్క్యూట్ వల్ల నివాసపు గుడిసె దగ్ధం అయ్యింది. దాంట్లో చేపలు పట్టే వలలు, కండే లతోపాటు, కట్టుబట్టల తో మాత్రమే బయటపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే నితిన్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారికి బియ్యము ఉప్పు పప్పు కారం నిత్యవసర సరుకులను అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కొల్ల శ్రీకాంత్, రబ్బాని,  చిర్రోల్ల రాకేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love