
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజపాలనకు నాంది పలికిన కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు, బూత్ అధ్యక్షులు పంది రాజు అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మండలంలోని వెంకట్రావుపేట గ్రామం లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాలంకరణ చేసి జాతీ య పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లా డుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాల ను స్మరించుకున్నామని అన్నారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అనిల్, సీని యర్ నాయకులు,పాత్కుల వెంకటేశం, ఎన్ఎస్యు ఐ మండల అధ్యక్షులు ప్రవీణ్, యువజన నాయ కులు భాను చందర్, రవీందర్, షఫీయుద్దీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.