బాల్ భవన్ లో “నో బ్యాగ్ డే “

నవతెలంగాణ- సూర్యాపేట: ఈ రోజు బాల్ భవన్ ఆధ్వర్యంలో ప్రతి నాల్గవ శనివారం రోజున పాఠశాలల్లో నిర్వహించే “నో బ్యాగ్ డే ” సందర్భంగా సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు డాన్స్, డ్రాయింగ్, సంగీతము, వాయిద్యము, కుట్టు అల్లికల విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. పిల్లలు అన్నిట్లో ముందు వుండాలని, నో బ్యాగ్ డే సందర్భంగా లలిత కళలు పోటీలు నిర్వహించడం వల్ల పిల్లల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీయడం అని అన్నారు. తదుపరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, విశ్రాంత అధ్యాపకుడు హమీద్ ఖాన్, చివ్వెంల జడ్పిహెచేస్ ప్రధానోపాధ్యాయురాలు కళారాని, జిల్లా బ్యూటీ పార్లర్ యూనియన్ కార్యదర్శి రోజా, అఖిల విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడమైనది. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక కళను నేర్చుకోవడం వల్ల ఒత్తిడి లేని భవిష్యత్తు సొంతం అవుతుందని, మానసిక వికాసం, ఉపాధికి కూడా ప్రయోజనం అని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి దాతగా జిల్లా బ్యూటీ పార్లర్ అధ్యక్షురాలు మన్నెం పద్మావతి గారు సహాయ సహకారాలు అందించినందుకు వారి సభ్యులను ఘనంగా సన్మానించారు, జెడ్పిహెచేస్ ప్రధాన ఉపాధ్యాయురాలు గోలి పద్మ, పాఠశాల సిబ్బందికి, పేరెంట్స్ కి బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బాల్ భవన్ సిబ్బంది దాసరి ఎల్లయ్య, సత్యనారాయణ సింగ్ కె, ఉమా, అనిల్, సాయి కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.

Spread the love