
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయ్యేంతవరకు ఏలాంటి ఉద్యోగ నియామకాలను చేపట్టారాదని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో శాంతి యూతంగా నిరాహార దీక్షలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇలాగే మాదిగలపై అక్రమ అరెస్టులను చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, మండల అధ్యక్షులు కిన్నెర మోహన్, మండల ప్రధాన కార్యదర్శి లసిమి గారి నరేష్, రవి, ,ప్రసాద్ ప్రభాకర్, శ్యామ్, రవితేజ, బి పర్వయ్య, పోశెట్టి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.