రోడ్డు లేదు.. ఆర్టీసీ బస్సూ రాదు

– గిరిజన తండావాసులకు అందని ఫ్రీ బస్సు
నవతెలంగాణ_ బొమ్మలరామారం
గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని పదే పదే ప్రజాప్రతినిధులు చెబుతున్న గిరిజన తండాలు అభివృద్దికి నోచుకోవడం లేదని సిపి ఐ (ఎం) పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారుతున్నా తండాల అభివృద్ది చెందడం లేదన్ని మండలంలో మొత్తం 36 గ్రామపంచాయతీలు ఉండగా వీటిలో సగానికి వరకు గిరిజనతండాలే. వీటిలో పూర్తిస్థాయి మౌలిక వసతులు, రవాణా సదుపాయం లేక తండావాసులు ప్రతినిత్యం ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు మండలంలోని మర్యాల మీదుగా చౌదర్
పల్లి కాల్వకుంట్లతండా, గోవిందతండా గ్రామాల మీదుగా చీకటిమామిడి గ్రామం వరకు రోడ్డు మరి ఆధ్వానంగా ఉందిని,ఈ రోడ్డు వెంట సుమారు 10కి పైగా గిరిజనతండాలు ఉన్నాయి. సరైన రోడ్డు లేక ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక నిత్యం ఈ గిరిజన తండావాసులు, మండల కేంద్రానికి గానీ, జిల్లా కేంద్రానికి గానీ వారి పనుల నిమిత్తం వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలు,బస్సులేక విద్యార్థులకు నిత్యం అవస్థలు
ఆటోలు లేదా కాలినడకన ప్రయణిస్తుంటారు. ఇక్కడి పరిసర ప్రాంతంలో సుమారు. 200పై చిలుకు విద్యార్థులు ఉండగా, వీరందరూ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకోవాలంటే చీకటి మామిడి, మర్యాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, ఆపై చదువుల కోసం మండలకేంద్రం వరకు నెల నెలా అద్దె ఆటోల్లో వెళ్లగా, భువనగిరి. హైదరాబాద్ వెళ్లేవారు చీకటిమామిడి అటు మర్యాల వరకు సొంత వాహనాలపై వచ్చి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయణిస్తుంటారు.వీరు ఎక్కడికి వెళ్లాలన్నా వారి గ్రామం నుంచి సుమారు ఐదు నుంచి ఏడు కిలో మీటర్లలో ఉన్న మర్యాల, చీకటిమామిడి గ్రామాల వరకు నడవడం లేదా ప్రైవేట్ వాహనాలు మొదట ప్రయాణం చేయక తప్పడం లేదు.ఈ ప్రాంత మారుమూల గ్రామాల మహిళలు, బాలికల, విద్యార్థులు వారి వారి చదువులు, వారి అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ ,దేవేందర్, సత్యనారాయణ ,మధుసూదన్ రెడ్డి ,కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love