No menu items!
Saturday, June 27, 2026
E-PAPER
No menu items!
Homeఖమ్మంరేపటి నుండే నామినేషన్ లు స్వీకరణ

రేపటి నుండే నామినేషన్ లు స్వీకరణ

- Advertisement -

– నియమావళి విడుదల జేసిన ఎంపీడీఓ
నవతెలంగాణ – అశ్వారావుపేట

సాధారణ స్థానిక ఎన్నికలు ప్రక్రియలో రెండో దశ లో జరగనున్న అశ్వారావుపేట మండల ఎన్నికల నామినేషన్ లు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో శనివారం నామినేషన్ లు నియమావళిని ఎంపీడీఓ అప్పారావు విడుదల చేసారు. అక్టోబర్ 30 వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ 14 వ తేదీ ఉప సర్పంచ్ ఎన్నిక వరకు సంబంధించి వివరాలను తెలిపారు.

30 వ తేదీ ఆదివారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు దాఖలు సమయం. ఇదే రోజు రిటర్నింగ్ అధికారి ద్వారా గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రదర్శన చేస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 2 వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వరకు గడువు ఉంటుంది. 3 వ తేదీ బుధవారం సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ లు పరిశీలన. ఇదే సాయంత్రం 5 గంటలకు  చెల్లుబాటు అయ్యే నామినేట్ అయిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

4 వ తేదీ గురువారం సాయంత్రం 5.00 గంటల వరకు అప్పీల్ కోసం గడువు.
5 వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.00 గంటలకు ముందు డిస్పోజబుల్.
6 తేదీ శనివారం మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత నామినేషన్ లు ఉపసంహరణ 
6 వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ
14 వ తేదీ ఆదివారం ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది.
14 ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు.ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అదే రోజు ఫలితాల ప్రకటన.

 ఫలితాలు ప్రకటించిన అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ. ఏదైనా కారణం చేత, ఉప పంచాయతీ సర్పంచ్ ఎన్నిక పైన పేర్కొన్న తేదీన నిర్వహించబడక పోతే, ఎన్నికల సంఘం ఆదేశానుసారం వ్యవహరించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -