కర్నాటి లింగారెడ్డిని విమర్శించే స్థాయి నోముల భగత్ కు లేదు

– నోరు అదుపులో పెట్టుకో.. ప్రజలు బుద్ది చెప్పినా నీ తీరు మారడం లేదు
– మరోసారి లింగారెడ్డిని విమర్శిస్తే పెద్దవూరలో అడుగు పెట్టనివ్వం.. మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్
నవతెలంగాణ – పెద్దవూర
మాజీ జెడ్పి వైస్ చేర్మెన్ కర్నాటి లింగారెడ్డి ని విమర్శించే స్థాయి నోముల భగత్ కు లేదని ఓడి పోవడంతో మతి బ్రమించి మాట్లాడుతున్నారని  మండల కాంగ్రెస్ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్  అన్నారు. ఈనెల 22న  బీఆర్ఎస్ రోడ్డు షోలో కర్నాటి లింగారెడ్డి పై చేసిన వ్యాఖ్యల పై గురువారం మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో మాట్లాడారు.ప్రతిసారి విమర్శలు చేస్తున్నారనీ ఆది మంచింది కాదని అన్నారు. జానారెడ్డి ఆశీస్సులతో పెద్దవూర మండలాన్ని  అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఘనత కర్నాటి లింగారెడ్డికే దక్కిందని గుర్తు చేశారు. ఎక్కడ నుంచో వచ్చి మీ తండ్రి మరణానంతరం ఇక్కడ గెలిచి విమర్శలు చేయడం స్థాయిని మించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లో కర్ణాటక లింగారెడ్డి  ని టార్గెట్ గా తీసుకొని విమర్శించడం  ఆనవాయితీ గా  పెట్టుకుంటున్నారనీ అది చాలా తప్పని అన్నారు.గత 50 ఏళ్ల నుంచి కర్నాటి లింగారెడ్డి కుటుంబం ప్రజాసేవకే అంకితం అయిందని, ప్రజాక్షేమం కోసం  అనేక సంక్షేమాలు, అభివృద్ధిలో పెద్దవూరను  నడిపించారని అన్నారు.  వారంలో నాలుగు రోజులు మండలో ఉంటూ  ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ,జానారెడ్డి, జై వీర్ రెడ్డి ఆశీస్సులతో మండలాన్ని అభివృద్ధి పథకలో నడిపించిన ఘనత లింగారెడ్డి కే సాధ్యం అయిందని ఆది గుర్తించు కోవాలని తెలిపారు.
ఈ నెల 22 తారీకున పెద్దవూర మండల కేంద్రం లో జరిగిన రోడ్డు షోలో మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్ 25 ఎకరాల భూమిని ఉచితంగా ఆక్రమించున్నారని ని విమర్శలు చేశావు.సర్వే నంబర్ 407 లో 2.18 గుంటల భూమి కన్న ఒక గుంట ఎక్కువ ఉన్న అదంతా మండలం లోని పేదలకు ఉంచితంగా ఇస్తామని సవాల్ విసిరారు.గత పదేళ్లుగా నుంచి మీరు ఎమ్మెల్యేగా,ఎంపీపి,జడ్పీటీసీలుగా, పదవులు పొందుతూ,  ప్రభుత్వంలో ఉన్న మీరు నిజంగా ఆక్రమించుకోని ఉంటే మీరు  ఎందుకు నాపై చర్యలు తీసుకో లేదని అన్నారు.మీలాంటి నాయకులు వస్తూపోతూ ఉంటారు కానీ జానారెడ్డి, జయవీర్ రెడ్డి, కర్నాటి లింగారెడ్డి వంటి  నాయకులు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. మరో సారీ మా నాయకుల పై అసత్యపు ఆరోపణలు చేస్తే పెద్దవూరలో అడుగు పెట్టనివ్వ మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటిసి కత్తి మహాలక్ష్మి ముత్యాల్ రెడ్డి, వూరే వెంకన్న, కర్నాటి మధు, నడ్డి ఆంజనేయులు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు కిలారీ మురళీ కృష్ణ యాదవ్, కోట అంజి, బొడ్డు వెంకట్, నడ్డి లక్షమయ్య, మళ్ళీ ఖాఖార్జున్,రవి, సతీష్, సైదులు, చిన్ని, శంకర్, కోటి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love