- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. జూలై 8న ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్నట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. భారత్, అమెరికా దేశాలు సయీద్‌ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించాయి.
- Advertisement -



