ఉత్తరం దక్షిణం

ఉత్తరం దక్షిణంఉత్తరం నుంచి వలస దక్షిణానికి
దక్షిణం నుంచి వలస ఉత్తరానికి
ఇల్లు వాకిళ్లు వదిలి పిల్ల జల్లలతో బ్రతుకు కష్టాలను మార్చుకుంటూ
సాగిపోతున్నారు రక్షణ స్థావరాల్లోకి
ప్రాణ రక్షణ ముఖ్యం బ్రతుకు రాదారుల్లోంచి ద్వారాలను
శరణార్థులుగా రక్షించడం అవసరం
ఇప్పుడు గాజా గాధ వ్యధవరితం
ప్రజలంతా కష్టాల కుంపటిలో కన్నీళ్లు రక్తం కలిసిన దు:ఖముతో సాగిపోతున్నారు
వలస వలస వలస ఈజిప్టు ప్రజల దీనగాధ ఇది
గాజా విషాదగాదకు తెరపడాలి
ప్రపంచమంతా సంక్షోభం లేని యుద్ధ వాతావరణం లేని
మానవతా సంగీతం వినిపించాలి
యుద్ధభేరి సంగీతాన్ని ఆపాలి ప్రజలంతా నవ ఉత్సాహంతో
మళ్లీ ఆనంద తరంగాలలో జీవితాలు గడపాలి
గాజా ప్రజలు లక్షలకు లక్షలు తరలిపోతున్నారు
ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి
ప్రాణ రక్షణ కోసం యుద్ధ వాతావరణం లేని
బీభత్స ప్రధానమైన బాంబుల వర్షం లేని పరిస్థితులను కోరుకుంటున్నాను
శాంతి మయ పావురాలను ఎగరవేయాలి
ఒకరిని ఒకరు సవరించుకోలేని శత్రుత్వ భీకర దాడులు లేని వాతావరణం కావాలి
అందరూ స్నేహపూరిత ప్రేమ వాతావరణం రావాలి పరస్పరం అలై బలై స్నేహితులై మెలగాలి
ఇది గాధ ప్రజల దీనగాదా ఒక దిగులు గాధ….
– డా|| అంజనాశ్రీ, 7702537453

Spread the love