వ్యక్తిత్వం

వ్యక్తిత్వంజీవితంలో మనమందరం విజయవంతంగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. విలాసవంతమైనది మాత్రమే విజయవంతమైన జీవితం కానే కాదు. ఒంటినిండా రోగాలు పెట్టుకొని ఎంతటి ధనవంతులైతే మాత్రం ఏం ప్రయోజనం. అటు వంటి జీవితాన్ని గడుపుతూ విలాసాలను, ధనాన్ని ఏం చేసుకోగలం? అయితే చాలామంది తమ జీవితంలో సగ భాగం డబ్బు సంపాదించేందుకే వెచ్చిస్తారు. దీని కోసం తమ వ్యక్తిత్వాన్ని కూడా వదిలేస్తున్నారు. ఇక మిగతా సగభాగం సమయాన్ని అదే ధనాన్ని ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు అవస్థలు పడుతుంటారు. దీన్ని విజయం అనుకుంటే అది పొరపాటు. కోల్పోయిన వ్యక్తిత్వంతో ఎంత డబ్బు సంపాదించినా అది వృధానే.

ఈ అనంతవిశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు ఇదివరకు లేరు. అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్చమైన, అరుదైన వారు. మీలోని ఆ ప్రత్యేకతను గుర్తించి ఆనందమయంగా అనుభవించండి’ అంటారు శ్రీశ్రీ. మనలోని మనిషిని, మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలనే ఉద్దేశంతో ఆ మహాకవి ఈ మాటలు అన్నారు. ఒక చంటిపాపను చూస్తే మనమందరం ఎంతగా ఆనందిస్తామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ చంటి పాప ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే మనందరినీ ఆనందపరుస్తుంది. ఈ అనుభూతిని ఎటువంటి ప్రత్యేకమైన శ్రమలేకుండానే మనమందరం అనుభవిస్తాం. సాధారణంగా ఎదుటివారికి మాటల ద్వారా కాకుండా మన ఉనికి ద్వారానే మన అనుభూతులను తెలియపరుస్తాం. కానీ ఎదిగే కొద్దీ మనకు తెలియకుండానే ఈ గుణాలకు మనం దూరంగా వెళ్ళిపోతుంటాం. ఈ ఆధునిక యుగంలో లెక్కలేనన్ని కొత్త అనుభూతులతో మన మనుసు మొద్దుబారి పోతుంది. దాంతో మన ఉనికి అంటే మన అసలైన గుణం మనకు తెలియకుండానే క్షీణించి పోతుంటుంది. యాంత్రిక వ్యక్తిత్వానికి అలవాటు పడిపోతాం. ఇలాంటి సందర్భంలో మన పూర్వ ఉనికిని, ఆ చంటి పిల్లల మనస్తత్వమైనటువంటి ఆనందాన్ని, సహజతను మనం ఎలా వెనక్కి తీసుకు రాగలం. కేవలం మనలోని అసలైన వ్యక్తిత్వం మాత్రమే మనల్ని మళ్ళీ మన పాత అనుభూతులను వెలికి తీయగలదు.
జీవితంలో మనమందరం విజయవంతంగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. విలాసవంతమైనది మాత్రమే విజయవంతమైన జీవితం కానే కాదు. ఒంటినిండా రోగాలు పెట్టుకొని ఎంతటి ధనవంతులైతే మాత్రం ఏం ప్రయోజనం. అటు వంటి జీవితాన్ని గడుపుతూ విలాసాలను, ధనాన్ని ఏం చేసుకోగలం? అయితే చాలామంది తమ జీవితంలో సగ భాగం డబ్బు సంపాదించేందుకే వెచ్చిస్తారు. దీని కోసం తమ వ్యక్తిత్వాన్ని కూడా వదిలేస్తున్నారు. ఇక మిగతా సగభాగం సమయాన్ని అదే ధనాన్ని ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు అవస్థలు పడుతుంటారు. దీన్ని విజయం అనుకుంటే అది పొరపాటు. కోల్పోయిన వ్యక్తిత్వంతో ఎంత డబ్బు సంపాదించినా అది వృధానే.
ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుండి ఓర్పుతో, సహనంతో, ఆనందంగా ఎలా అధిగామించగలం. అలాగే ఆ సందర్భాన్ని మనకు ఒక అవకాశంగా ఎలా మలచగలం. నిజమైన విజయమంటే ఇదే. జీవించడం ఓ కళ అంటారు మానసిక నిపుణులు. అలా జీవించాలంటే మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం సరిగ్గా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనం కొంత శ్రమించాల్సిందే. దీనికి మార్గాలను అన్వేషించాలి. దీని కోసం మనకు ఎన్నో రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం పుస్తకాలు చదివినంత మాత్రానా మన పాత ఉనికి, అనుభూతులు, స్నేహశీలత, అసలైన వ్యక్తిత్వం వెలికిరావు. పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. సజనాత్మకత పెంచుకోవాలి. ఇవన్నీ మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. అప్పుడే మనం విచక్షణతో ఆలోచించి అసలైన వ్యక్తులుగా ఉండగలం. ఇవి మనలోని శక్తి సామర్త్హ్యాలను పెంచి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేలా మనల్ని సిద్ధం చేస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగల స్థాయికి మనల్ని తీసుకువెళతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని మార్గదర్శకంగా తీసుకొనే విధంగా మనల్ని మారుస్తాయి.

Spread the love