సరైన బువ్వ పెట్టడం లేదు…

Not giving a proper look...– రోడ్డుపై చిట్యాలలో వసతి గృహ బాలికల బైటాయింపు
నవతెలంగాణ-చిట్యాల
ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో తమకు సరైన భోజనం, అల్పాహారం పెట్టడం లేదని జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్థినులు నిరసన తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రెండు రోజుల నుంచి తమకు సరైన టైంలో అల్పాహారం పెట్టడం లేదని, భోజనం సరిగా పెట్టడం లేదని ఆరోపించారు. హాస్టల్‌ వార్డెన్‌ పట్టించుకోవడం లేదని తెలిపారు. సంబంధిత కాంట్రాక్టు వర్కర్లను అడిగితే తమకు జీతాలు ఇవ్వడం లేదని, తాము ఎక్కడ నుండి తెచ్చిపెట్టాలని అంటున్నారని అన్నారు. సంబంధిత బాధ్యులపై చర్య తీసుకుని తమకు సమయానికి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. విద్యార్థులు బైటాయించిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పి హాస్టల్‌కు పంపించారు.

Spread the love