435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి శుక్రారం మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రజారోగ్య విభాగం, వైద్యవిద్య విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. మల్టీ జోన్‌ -1 లో 270, మల్టీజోన్‌ -2లో 161 ఖాళీలున్నాయి. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) లో నాలుగు పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని, మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

Spread the love