నర్సింగ్ పల్లి ఆలయంలో వైభవంగా వసంతోత్సవo

నవతెలంగాణ – మోపాల్

శుక్రవారం రోజున హోళి పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లి లో వసంతోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మొదట స్వామి వారికి నవ కలశ పూర్నాభిషేకం నిర్వహించి అనంతరం ఆలయ గోశాలలో జన్మించిన దూడకు రంగులు పూసి వసంతోత్సవాన్ని మొదలుపెట్టారు. స్వామి వారికి చేసిన అభిషేకం ద్వారా వచ్చిన పాదోదకాన్ని మరియు గోగు పూలతో తయారు చేసిన రంగులను ఒకరి పై ఒకరు చల్లుకొని ఆనందంగా హోళి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి గారితో పాటు ఆలయ అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య, శ్రీధరాచార్య, విజయ్ స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు నరాల సుధాకర్, నర్సారెడ్డి, శ్రీనివాస్, నవీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love