అంగన్వాడి కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమ

నవతెలంగాణ –పెద్దవూర
అనుముల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి సెక్టార్ పరిధిలోని చలకుర్తి 02 అంగన్వాడీ కేంద్రం లో గురువారం సూపర్ వైజర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్లలో పరిశుభ్రత నాణ్యత ప్రీస్కూల్ కార్యక్రమాలు ఆరోగ్యలక్ష్మి భోజనం అన్ని విషయాల పైన  అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు అక్షరాభ్యాసం తోపాటు పోషణ ప్రతిజ్ఞ, అలాగే ప్రీస్కూల్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పోషణ మాసంలో భాగంగా అన్ని విధాల పోషకాహారాల గురించి అవగాహన కల్పించామని తెలిపారు.ప్రతి ఒక్కరూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికలు సరైన పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని,నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీస్కూల్ ఆటపాటలతో అవకాశాలను కల్పిస్తూ నేర్చుకునే విధంగా ప్రీస్కూల్ కిట్ మెటీరియల్ ను అందించామని అన్నారు. అంగన్వాడి టీచర్లు ప్రీస్కూల్ విద్యను ఏ విధంగా పిల్లలకు నేర్పించాలో అవగాహన కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, నజీర్,శ్రీదేవి, రేణుక,ఆయా పద్మ, తల్లులు, గర్భిణీలు, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love