ముల్లంగి లో పోషణ పక్షం..

నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్పల్లి మండలంలోని ముల్లంగి (ఐ) గ్రామంలో గురువారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించినట్లు డిచ్ పల్లి సూపర్వైజర్ బుజ్జి తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాటించాల్సిన అంశాలను వివరించారు. అనిమీయ, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. చేతులు శుభ్రత ఎలా ఉంచుకోవాలో వివరిస్తూ,తమ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీవ్రలోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ కు గురికాకుండా చుసుకోవలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కే.సరిత, కె.సువర్ణ ఏఎన్ఎం మౌనిక ,ఆశ వర్కర్ శ్రావణి, సుమలత, ఐకెపి శ్రీలత(వివో) , గర్భిణీ బాలింతలు, పాల్గొన్నారు.
Spread the love