సోపూర్ అంగన్ వాడిలో పోషణ పక్వాడ్

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని సోపూర్ అంగన్ వాడి కేంద్రంలో టీచర్ సులోచన ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం శుక్రవారం  నిర్వహించారు. ఈ సంధర్భంగా బాలీంతలకు, గర్భీణిలకు, చిన్న పిల్లల తల్లులకు సమావేశం నిర్వహించి, పాషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఆశావర్కర్ బాలమణి మాట్లాడుతూ.. పిల్లలకు  టీకాలు సమయానుకులంగా ఇవ్వాలని, అంగన్ వాడి లో కేంద్రంలో పోషక ఆహరం తప్పక తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ టీచర్ సులోచన మాట్లాడుతూ.. గుడ్లు, బాలమృతం, పాలు తప్పక రెగ్యులర్ గా లబ్దిదారులకు అందిస్తున్నామని, తాజా కూరగాయలు, పండ్లు గర్భిణిలు, బాలింతలకు , పిల్లలకు అంగించాలని, బరువు, ఎత్తు పెర్గుతారని , ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పోషణ పక్వాడ్ కార్యక్రమంలో అంగన్  టీచర్, ఆశావర్కర్ , పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love