నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత పల్లి గ్రామానికి చెందిన స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడగును జనగాం జిల్లా పెంబర్తిలో రావి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించినట్లు మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎల్లంల జంగయ్య యాదవ్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల బత్తిని సుధాకర్ గౌడ్, పబ్బతి ఉప్పలయ్య, సుర్పంగా నరసింహ, మట్ట బాలకృష్ణ గౌడ్, ఎల్లంలో పెద్ద జంగయ్య, వంగాల రమేష్ గౌడ్, ఎల్లంల స్వామి, కంబాలపల్లి రఘు, బండి మహేష్, సుర్పంగ శ్రవణ్ కుమార్, ఎల్లంల వెంకటేష్ యాదవ్ లు పాల్గొన్నారు.