నవతెలంగాణ-జైనథ్
మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఏఎస్సిడిఓ నారాయణరెడ్డి గురువారం రాత్రి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఆయన వెంట వార్డెన్ ఎం.నారాయణ ఉన్నారు.