
నవతెలంగాణ – అశ్వారావుపేట : జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రకటించే ఉత్తమ బి ఎల్ ఒ లు ఎంపికలో ప్రమాణాలు పాటించలేదని పలువురు బి ఎల్ ఒ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.దీర్ఘ కాలంగా పని చేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఏడాది క్రితం బి ఎల్ ఒ గా విధులు నిర్వహిస్తున్న వారిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 14 వ ఓటర్ దినోత్సవం సందర్భంగా గత ఎన్నికల్లో ఉత్తమ పనితనం కనబరిచిన బి ఎల్ ఒ లను ఉత్తమ లు గా గుర్తించిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ గురువారం చిరు సత్కారం చేసారు. మండల వ్యాప్తంగా మొత్తం అయిదుగురు ను గుర్తించారు.ఇందులో ముగ్గురు స్త్రీలు,ఇద్దరు పురూషులు ఉన్నారు.అయితే గత నాలుగు దఫాలుగా బి ఎల్ ఒ లుగా పని చేసిన వారిని గుర్తించకపోవడం బాధాకరం అని కొందరు మహిళా బి ఎల్ ఒ లు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయం అయి తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.