చిన్నఎడ్గిలో మంచి నీటి సమస్య పరిష్కరించిన అధికారులు..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని చిన్న ఎడ్గి గ్రామములో ఆర్ డబ్ల్యూఎస్ అధికారి ఏఈ నయూమ్ అధ్వర్యంలో  మంచి నీటీ  సమస్యను ఎమ్మెలే ఆదేశాల మేరకు పరిష్కరించడం జర్గిందని తెలిపారు. ఈ సంధర్భంగా బుదువారం నాడు చిన్న ఎడ్గి గ్రామములోని నీటీ కులాయిలను ఏఈ పరీశీలించారు. ఏఈ మాట్లాడుతూ.. గ్రామములోని దళిత కాలనీలో తీవ్ర నీటీ సమస్యను గత కొద్ది రోజలుగా ఎదురుకోంటున్నారు. ఇట్టి విషయం ఎమ్మెలే తోత లక్ష్మీకాంతారావ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పరిష్కరించాలని సంభందిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. వెంటనే సింగవ్ ఫేజ్ మేాటారు బిగించి నీటీని పునరుద్దరించడం జర్గింది. కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేసారు. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు, జీపీ సెక్రట్రి షిండే విజయ్ తదితరులు పాల్గోన్నారు.
Spread the love