ఆయిల్ఫెడ్ అతిథి గృహం రేపు ప్రారంభం

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ సంస్థ మౌళిక సదుపాయాల కల్పన లో భాగంగా రూ.1 కోటీ 40 లక్షలతో నిర్మించిన భవనం సముదాయాలను ఆదివారం ఆ సంస్థ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 90 వ దశకంలో ఈ ప్రాంతం లో ఆయిల్ ఫాం సాగు ప్రారంభించారు. నాడు హాట్ (గుడిసె) లో ప్రారంభం అయిన ఆయిల్ఫెడ్ ప్రస్తానం నేడు రెండు కర్మాగారాలు నిర్మించడంతో పాటు మరో అదనపు పరిశ్రమను నిర్మించడానికి సంస్థ శ్రీకారం చుట్టారు.
- పనులను పర్యవేక్షిస్తున్న చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి
– పనులను పర్యవేక్షిస్తున్న చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి
విస్తరిస్తున్న సాగు, సాగుదారుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ మౌళిక వసతుల కల్పన కు నడుం బిగించింది. ఈ క్రమంలో రూ.1 కోటీ 30 లక్షల వ్యయంతో అతిధి గృహం,మరో రూ.8 లక్షల 90 వేలు నిధులతో ఫార్మర్ షెడ్ ను నిర్మించారు.ఈ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి లు ప్రారంభిస్తారని డి.ఒ బాలక్రిష్ణ శనివారం తెలిపారు.
Spread the love