Thursday, May 7, 2026
E-PAPER
Homeజాతీయంఉన్మాద‌ చ‌ర్య‌కు ఏడాది పూర్తి..జ‌మ్మూలో భ‌ద్ర‌త పెంపు

ఉన్మాద‌ చ‌ర్య‌కు ఏడాది పూర్తి..జ‌మ్మూలో భ‌ద్ర‌త పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జ‌మ్ముక‌శ్మీర్‌లో 2025 మే7న‌ ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల‌తో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా ఈ రోజుతో ఈ ఉన్మాద‌ చ‌ర్య‌కు ఏడాది పూర్తి అయింది. ఉగ్ర‌మూక‌లు జరిపిన పాశ‌విక దాడిలో 26మంది అమాయ‌క యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భార‌త్-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు తలెత్తాయి. దౌత్య‌ప‌రంగా అనేక ఆంక్ష‌లు విధించుకున్నాయి. పాక్ భూభాగంలోని ఉగ్ర‌వాదుల స్థావరాల‌పై ఇండియ‌న్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది. దీంతో 100పైగా ఉగ్ర‌వాదులు హ‌త‌మైయ్యారు. ఆ త‌ర్వాత పాక్ ఆర్మీ ప్రతిదాడుల‌తో రెండు దేశాల మ‌ధ్య యుద్ధం వాతావ‌రణం వేడెక్కింది. మే 10 ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో రెండు దేశాలు ప‌ర‌స్పరం దాడులు చేసుకున్నాయి. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్‌లోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌తాను పెంచారు. అదే విధంగా పూంచ్ స‌రిహ‌ద్దు ప్రాంతాల వ‌ద్ద భారీ నిఘా పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -