ఒక్కరి ప్రమాదమైనా, అందరి ప్రమాదమే

ఎన్‌.రామ్‌ న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపై, దానితో సంబంధం ఉన్న వారి ఇళ్ళపై ఢిల్లీ పోలీసుల అనాగరిక విస్తత దాడులు; జర్న లిస్టులు, ఇతర ఉద్యోగుల ఎలక్ట్రానిక్‌ పరికరాలను విచక్షణా రహితంగా (స్వాధీనం చేసుకున్న సందర్భంలో కనీస నిబంధనలకు పాటించకుండా) స్వాధీనం చేసు కోవడం; న్యూస్‌ పోర్టల్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం; తీవ్రవాద సంబంధిత అభి యోగాలపై న్యూస్‌క్లిక్‌ సంస్థాపక సంపాదకుడు, ప్రబీర్‌ పుర్కాయస్థ, దాని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, అమిత్‌ చక్ర వర్తిల అరెస్ట్‌; ఇంకా ఇది చాలదన్నట్టు, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ తాజాగా ఒక క్రిమినల్‌ కేసును దాఖలు చేసిన తర్వాత న్యూస్‌క్లిక్‌ ఆవరణలో, దాని సంస్థాపక సంపాదకుని ఇంట్లో సోదాల నిర్వహణలతో పాటు ఒక మామూలు డిజిటల్‌ వార్తా సంస్థపై దాడి చేయా లని ఐదో దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఇలాంటి చర్యలు, 1975-77 మధ్య ఎమర్జెన్సీకాలం నుండి భారతదేశ మీడియా స్వేచ్ఛలో అత్యంత తక్కువ స్థాయిని సూచిస్తున్నాయి. వివిధ స్థాయిల్లో వత్తి పరంగా, చట్టపరంగా, రాజకీయపరంగా సమిష్టి చర్యలు, సమర్థవంతమైన ప్రతిఘటనలు లేకుంటే, ‘రిపోర్టర్స్‌ సాన్స్‌ ఫ్రంటియర్స్‌’ ప్రచురించిన వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌ 2023లో, మొత్తం 180 దేశాల్లో 161వ స్థానంలో ఉన్న భారతదేశం 2014 తరువాత సాధించిన క్షీణతనే కొనసాగిస్తుంది.
ఈ నేపథ్యానికి వ్యతిరేకంగా, పుర్కాయస్థ, ఇతరులపై ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చాలా ఉప యోగకరమైన సమాచారాన్నిచ్చే విధంగా ఉంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ మనను ప్రావీణ్యంలేని, గందరగోళంలో ఉన్న పోలీసుల మనసు ల్లోకి తీసుకెళ్లి, ఒక ఊహాజనితమైన పోలీస్‌ రాజ్యం ఎలా ఉంటుందో ఊహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది అనాగరిక మైన, క్రూరమైన, తెలివితక్కువ పోలీస్‌ రాజ్యం, దాని లక్ష్యం (ఒకవేళ కోర్టులు అనుమతిస్తే) ”ముందుగా శిక్ష, తరువాతనే తీర్పు” అనే విధంగా ఉంటుంది.
ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన క్రిమినల్‌ కేసును పరిశీలిస్తే (సున్నితమైన కారణాల వల్ల ఎఫ్‌ఐఆర్‌ అప్‌లోడ్‌ చేయకూడదనే పోలీసుల ఆదేశాలున్నప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌ కొంతమంది జర్నలిస్టుల చేతుల్లోకి వెళ్ళింది) ఇది ఒక ప్రేరేపిత, నకిలీ కేసు అని తెలుస్తోంది. న్యూస్‌ క్లిక్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు సమర్థ నీయమైనవి కాదు, అవి బూటకమైనవి. అవి ఎలా సమర్థనీ యమైనవి కావో ”ద హిందూ” సంపాదకీయం స్పష్టం చేసింది.
కానీ న్యూస్‌క్లిక్‌పై దాడి, పోలీసులు చేసిన అల్లర్ల కథనం కాదు, ఇదొక రాజకీయ కథనం. స్వతంత్రంగా, విమర్శనాత్మ కంగా వ్యవహరించే ఒక సాధారణ ప్రగతిశీల, వామపక్ష భావ జాలం గల డిజిటల్‌ వార్తా సంస్థతో, బీజేపీ, హిందూత్వ నిరంకుశ పాలన చేస్తున్న యుద్ధానికి సంబంధించిన కథనం ఇది. ఈ వైరుధ్య స్వభావం అర్థం కావాలంటే, మనం కొన్ని ప్రాథమిక వాస్తవాల్ని చూడాలి.
న్యూస్‌ క్లిక్‌. ఇన్‌ అనే సంస్థను పీపీకే న్యూస్‌ క్లిక్‌ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలో 2009లో స్థాపించారు. చాలాకొద్ది బడ్జెట్‌తోనే అది పనిచేస్తుంది. రోజువారీ పనులను ఒక సంపాదక వర్గం నిర్వహిస్తుంది. దీని స్థాపకుడు, ప్రధాన సంపాదకుడైన ప్రబీర్‌ పుర్కాయస్థ ఒక ఇంజినీర్‌, విద్యుత్‌, టెలి కాం, సాఫ్టువేర్‌ రంగాల్లో పనిచేసే ఒక సైన్స్‌ కార్యకర్త, భార తీయ వామపక్షాలకు ఒక ప్రభావవంతుడైన మేధావి. ఈ న్యూస్‌ నెట్‌ వర్క్‌ ప్రజా ఉద్యమాలు, పోరాటాలపై వ్యాఖ్యానిస్తూ, విశ్లే షిస్తూ, వాటిని నివేదించే పనిపై దష్టిని కేంద్రీకరిస్తుంది. ఇది క్రమం తప్పకుండా ఒక స్థాయి సమస్యలపై విమర్శనాత్మక, ప్రగ తిశీల గొంతుకలను అందిస్తుంది. ఆ క్రమంలోనే, న్యూస్‌క్లిక్‌ మోడీ ప్రభుత్వ నిరంకుశ ”హిందూత్వ” లేదా హిందూ – నిరం కుశ రాజకీయ ఎజెండాను వ్యతిరేకిస్తూ, దాని విధానాల్ని విమర్శిస్తోంది.
న్యూస్‌ పోర్టల్‌ నివేదికలు, విశ్లేషణలు, రోజువారీ తాజా సమాచారం అంతా ఉచితం. వ్యాపారం, చందాదారులపైన, విదేశాల్లో కస్టమర్ల ఎంపిక కోసం పత్రికా రచనల అమ్మకాలపైన, రోజువారీ నిర్వహణకు, దాని విస్తరణకు కొన్ని పెట్టబడుల పైన ఆధార పడుతుంది. ఈ డిజిటల్‌ మీడియా వ్యాపారం లాభా పేక్షలేనిది కానప్పటికీ, లాభాల చేత ప్రేరేపించబడదనేది స్పష్టం.
మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020 – 21లో రైతుల సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టిన సమయంలో న్యూస్‌క్లిక్‌ పాత్రికేయ పాత్ర పోషించింది. రైతు ఉద్యమ స్థానం నుండి, సమగ్రమైన, సానుభూతితో కూడిన కవరేజీని, ఆ సందర్భంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విస్తతమైన వ్యాసాలు, వీడియోల్ని ప్రజలకం దించింది. న్యూస్‌క్లిక్‌ కవరేజ్‌, పెద్ద మీడియా సంస్థలు, వార్తా పత్రికలు, టీవీ ఛానళ్ళ కషిని కూడా అధిగమించింది. అంతేకాక రైతాంగ ఉద్యమం విజయం సాధించడానికి, జనాదరణలేని చట్టాలు రద్దవడానికి, ఆ కవరేజ్‌ దోహదపడింది.
అమెరికా పౌరుడు, వామపక్ష మేధావి, కార్యకర్త, అత్యంత ప్రతిభావంతుడైన వ్యాపారి నెవెల్లీరారు సింఘమ్‌ కథలోకి ప్రవే శిస్తాడు. ఆయన, ‘థాట్‌ వర్క్స్‌,ఇంక్‌’ అనే ఒక ప్రపంచ స్థాయి ఐటీ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు, ప్రధాన యజమాని. ఈ సంస్థ భారతదేశానికి చెందిన ఉద్యోగులు, కార్యాలయాలు, పని ప్రదేశాలను కలిగి ఉంది. 2017లో థాట్‌ వర్క్స్‌ను, బ్రిటీష్‌ ప్రైవేట్‌ సంస్థ ‘అపాక్స్‌ పార్ట్నర్స్‌’కు 785 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. ఈ విక్రయం ద్వారా పొందిన డబ్బుతో సింఘమ్‌, అతని టీం సభ్యులు, అమెరికాలో పీపుల్స్‌ సపోర్ట్‌ ఫౌండేషన్‌ లిమిటెడ్‌ (పీఎస్‌ఎఫ్‌) అనే ఒక ప్రైవేట్‌ సంస్థను స్థాపించారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమంటే, ఈ పీఎస్‌ఎఫ్‌ సంస్థ లాయర్‌, మేనేజర్‌ అయిన జాసన్‌ ఫెచర్‌ సంస్థ తరపున విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ”పీఎస్‌ఎఫ్‌ కు వితరణగా ఇచ్చిన నిధులన్నీ కూడా ”థాట్‌ వర్క్స్‌” అమ్మకం ద్వారా వచ్చిన నిధుల నుండే వచ్చాయి. పీఎస్‌ఎఫ్‌, విదేశీ ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులను స్వీకరించలేదు. ఈ ఫౌండేషన్‌ వరల్డ్‌ వైడ్‌ మీడియా హౌల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూఎంహెచ్‌) స్వంతంగా కలిగి ఉండి, దానిని నిర్వహి స్తుంది. ఈ సంస్థ, ప్రపంచ ప్రజల గురించి వార్తలను అందించే ప్రగతిశీల మీడియా ప్రాజెక్టులలో వివిధ పెట్టుబడులు పెట్టే, లాభాపేక్ష గల పెట్టుబడి సాధనం.”
2017 సంవత్సరాంతానికి, డబ్ల్యూఎంహెచ్‌, న్యూస్‌క్లిక్‌ను తన లక్ష్యాలకనుగుణమైన సంస్థగా గుర్తించి, న్యూస్‌క్లిక్‌లో పెట్టు బడులు పెట్టడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల పాటు థాట్‌ వర్క్స్‌లో పని చేసిన న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపక సంపాదకుడు పుర్కాయస్థ ఈ పెట్టుబడిదారుల వద్ద గుర్తింపు పొందాడు. 2018 మార్చిలో న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడి కార్యరూపం దాల్చింది.
2021నుండి న్యూస్‌క్లిక్‌ను లక్ష్యం చేసుకొని, కేంద్ర ప్రభు త్వం ఆధీనంలోని సంస్థలు, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్ట్టరేట్‌, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం, ఆదాయ పన్ను శాఖలు విస్తతంగా దాడులు, సోదాలు నిర్వహించి, కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. ‘మనీ లాండరింగ్‌’, లేదా పన్నుల ఎగవేత లేదా పరికరాలు, డాక్యుమెంట్లు, ఈమెయిల్‌ లలో తప్పుడు పనులు చేసిన రుజువులు లేకపోవడంతో ఈ విచారణలు నిల్చిపోయాయి.
ఇప్పుడు ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ ఒక సమగ్రమైన పరిశోధక కథనంతో ప్రవేశిస్తుంది. ఈ కథనానికి ”ఏ గ్లోబల్‌ వెబ్‌ ఆఫ్‌ చైనీస్‌ ప్రోపగాండా లీడ్స్‌ టు ఏ యూఎస్‌ టెక్‌ మొగల్‌” అనేది శీర్షిక. చైనాను సమర్థించి, దాని గురించి ప్రచారాన్ని ముందుకు తీసుకొనిపోయే విలాసవంతమైన నిధుల ప్రభావాన్ని వెలికి తీసినట్టు ఆ కథనం సారాంశం. వీటి మధ్యలో ఒక శక్తివంతుడైన అమెరికాకు చెందిన మిలియనీర్‌, నెవెల్లీ రారు సింఘమ్‌ ఉన్నాడనీ, ఈయన వామపక్షీయుల శ్రేయోభిలాషి అనీ, కాబట్టి ఇది నేరారోపణ చేయదగిన నేరమని ఈ కథనం చెపుతుంది. ఈ వ్యాసం న్యూస్‌క్లిక్‌ గురించి రెండు ఉదాహరణలు ఇచ్చింది. ”భారతదేశంలో అధికారులు, పత్రికలను అదుపుచేసిన సమ యంలో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ దానిపై దాడి చేశారు కానీ ఎలాంటి రుజువులు చూపించలేదు; ఈ న్యూస్‌క్లిక్‌ సైట్‌కు, సింఘమ్‌ నెట్వర్క్‌ డబ్బును సమకూర్చింది”
ముఖ్యంగా ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ వ్యాసం, న్యూస్‌క్లిక్‌ ఏ చట్టాన్నైనా ఉల్లంఘించిందని ఆరోపించలేదు. విచారణ చేసే జర్నలిస్టులు లోతైన పరిశోధన చేసి, డిజిటల్‌ వార్త నెట్వర్క్‌ సంపాదకులు లేదా యాజమాన్యాన్ని కలిసి ఉండి ఉంటే, ‘ఫైనా న్సింగ్‌’ అనేది, డబ్ల్యూఎంహెచ్‌ పెట్టుబడి రూపంలో ఇచ్చిందని తెలుసుకొని ఉండెడివారు. వాటి వివరాలను చట్ట ప్రకారం అధి కారులకు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి, 2021 లో దాడులు చేయడానికి రాజకీయ లక్ష్యంతో ఏర్పాటుచేసిన భారత ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించిన విధంగా, ”మనీ లాండరింగ్‌” అనే ప్రశ్నే లేదు. ఢిల్లీ హైకోర్టు కూడా న్యూస్‌ క్లిక్‌కు అను కూలంగా, కంపెనీ అధికారులను అరెస్ట్‌ చేయకుండా మధ్యం తర రక్షణ కల్పించింది. దీనికి సంబంధించిన విషయంపైన ఆదాయ పన్నుల అధికారులు, మీడియా సంస్థకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును కింది కోర్టు కొట్టేసింది. చైనా ప్రభుత్వం మాట్లాడు తున్న విషయాల న్యూస్‌ సైట్‌ కవరేజ్‌కి సంబంధించి, 70 ఏళ్ళ చైనా విప్లవం, ఆ కాలంలో జరిగిన మార్పులకు సంబంధించి అక్టోబర్‌ 2, 2019 నాడు పోస్ట్‌ చేసిన వీడియోతో రావడమే ద న్యూయార్క్‌ టైమ్స్‌ జర్నలిస్టులు చేయగలిగేది.
ద న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం, భావజాలపరంగా బలమైన జర్నలిజం. రిపోర్టింగ్‌ ముసుగులో ప్రచారంతో కూడిన సంపా దకీయం కూడా అంగీకారయోగ్యమైన విమర్శే. డబ్ల్యూఎంహెచ్‌ మేనేజర్‌, లాయర్‌ అయిన జాసన్‌ ఫెచర్‌కు, జర్నలిజం ప్రవ ర్తనా నియమావళిపై తీవ్ర ఆక్షేపణలున్నాయి. ఆ వ్యాసం ప్రచు రణకు ముందే రిపోర్టర్లు లేవనెత్తిన ప్రశ్నలకు, ఆయన పీఎస్‌ఎఫ్‌ తరఫున ఇలా స్పందించాడు: ”పీఎస్‌ఎఫ్‌ ఎలాంటి నిధులను స్వీకరించలేదు, ఏ విదేశీయుని నుండి గానీ, ఏ సంస్థ నుండి గానీ, ఏ రాజకీయ పార్టీ నుండి గానీ, ఏ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి మార్గదర్శకాలను తీసుకోలేదు. పీఎస్‌ఎఫ్‌ నిధుల వనరు థాట్‌ వర్క్స్‌ అమ్మకం ద్వారా కంటే కూడా చైనా నుండి వచ్చినట్లు పాఠకులు విశ్వసించే విధంగా ద న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ఉంది.”
న్యూస్‌క్లిక్‌ను మళ్ళీ లక్ష్యం చేయడానికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెక్‌ కార్థైట్‌ ప్రచారం అంటే, తప్పుడు సమా చారం, భయానక కథనాలు, అవమానాల ద్వారా ఏది అవస రమో ఆ రవ్వను ద న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం సమకూర్చింది. అమెరికా వార్తాపత్రిక బహిర్గతం చేసిన విధంగా భారతదేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, దానికి సంబంధిం చిన ఆరోపణలను సామాజిక మాధ్యమాల ద్వారా హిందూత్వ అనుకూల భక్తులు తప్పుడు ప్రచారానికి పూనుకుంటూ, న్యూస్‌ క్లిక్‌, దాని వెనుక ఉన్న వ్యక్తులపై హింసాత్మక బెదిరింపులకు దిగుతున్నారు. ప్రధాన మీడియా స్రవంతిలోని ఒక వర్గానికి చెందిన రెండుటీవీ ఛానళ్ళు ప్రభుత్వానికనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు నటిస్తూ, ఈ తప్పుడు ప్రచారం చేసే వారితో కలి శాయి. దర్యాప్తు సంస్థలు లీక్‌ చేస్తున్న సమాచారంతో తప్పుడు వార్తలను సష్టిస్తున్నాయి. ఇది, ఉగ్రవాద సంబంధిత ఆరోప ణలపై తాజాగా నేరం మోపి కేసు విచారించడానికి వేదిక అయ్యింది.
అక్టోబర్‌ 3, ఆ తరువాత జరిగిన దానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు, న్యాయవాదులు, రాజకీయ, సామాజిక కార్యకర్తలు, ప్రజల నుండి విస్తతంగా నిరసనలు వ్యక్తం అవుతు న్నాయి. న్యూస్‌క్లిక్‌ పై బీజేపీ ప్రభుత్వం చేసిన దాడిని ఖండిస్తూ, విమర్శిస్తూ వార్తాపత్రికలు సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురి స్తున్నాయి. ప్రెస్‌క్లబ్‌లు, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘాలు, వత్తి సంఘాలు ముఖ్యంగా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, డిగీపబ్‌, నెట్వర్క్‌ ఆఫ్‌ విమెన్‌ ఇన్‌ మీడియా ఇండియాతో పాటు న్యూ యార్క్‌కు చెందిన జర్నలిస్టుల రక్షణ కమిటీ ప్రభుత్వ దాడిని ఖండించాయి. న్యూస్‌క్లిక్‌కు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టు లకు సంఘీభావంగా చేపట్టిన సమిష్టి చర్యలు చాలా ప్రోత్సాహ కరంగా ఉన్నాయి. అంతే ముఖ్యంగా, భారతదేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులు కొందరు హదయపూర్వక మద్దతుతో ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్ళారు.
కానీ ఇది సరిపోదు. దీనినొక సంఘటనగానే చూస్తే, మీడియా స్వతంత్రత, స్వేచ్ఛను రక్షించే ప్రచారం విజయ వంతం కాదు. ప్రభుత్వ అణచివేతను అనేక మార్గాల్లో ప్రతిఘ టించి, ఎదుర్కొనవచ్చు. సామాజిక మాధ్యమం, వత్తిపరమైన మాధ్యమంలోని కొన్ని విభాగాల్లో తప్పుడు సమాచారం, ద్వేష పూరిత రాజకీయాలున్న విషపూరిత సమాచార పర్యావరణ వ్యవస్థలో ప్రచారాన్ని కొనసాగిస్తూ, అభివద్ధిపరచడమే నేటి నిజమైన సవాల్‌.
2014 మే, నుండి తమ పనికి సంబంధించి 19 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. కానీ హంతకులపై చర్య ల్లేవు. జర్నలిస్టుల రక్షణ కమిటీ చేత సంవత్సరం, సంవత్సరం సంకలనం చేయబడిన గ్లోబల్‌ ఇంప్యూనిటీ ఇండెక్స్‌ అనే అవమానకరమైన క్లబ్‌లో భారతదేశం శాశ్వతసభ్యురాలిగా మిగి లింది. ఇటీవల ‘ద వైర్‌’ పత్రికలో ప్రచురితమైన వ్యాసం ప్రకా రం, 16 మంది జర్నలిస్టులపై ‘ఉపా చట్టం’ కింద కేసులు మో పారు. ఏడుగురు జైళ్ళలో ఉన్నారు, 8 మంది బెయిల్‌పై బయ టికి వచ్చారు. ఒక్కరిని మాత్రం అరెస్ట్‌ చేయలేదు. ప్రాధా న్యతా క్రమంలో, ప్రతీ కేసును తీవ్రంగా తీసుకోవాలి. న్యూస్‌ క్లిక్‌ పై చేసిన దాడికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల ద్వారా వచ్చి న ఊపును ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడానికి ఉపయోగిం చాలి. ఈ ఉద్యమం కేవలం స్వతంత్ర జర్నలిస్టులు, విమర్శనా త్మక జర్నలిస్టుల గొంతులకు మాత్రమే కాక, మన రాజ్యాంగం హామీ ఇచ్చిన వారి జీవితాలు, భద్రత, ప్రాథమిక స్వేచ్ఛలను కూడా రక్షించడానికి కట్టుబడి ఉంటుంది.ఒక్కరు ప్రమాదంలో ఉన్నా, అందరూ ప్రమాదంలో ఉన్నట్లే.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451

ఎన్‌.రామ్‌ 

Spread the love