క్రీడా పాఠశాలకు ఎంపికలు

నవతెలంగాణ – అశ్వారావుపేట: క్రీడా పాఠశాల 6 వ తరగతిలో చేరికలుకు జిల్లాస్థాయి ఎంపికలు సోమవారం నిర్వహించారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఈ ఎంపికల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలస్థాయిలో ఎంపికైన విద్యార్ధులను జిల్లాస్థాయికి పంపిస్తామని అక్కడ ఎంపిక చేసి రాష్ట్రంలోని హకీంపేట లో గల క్రీడా పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారని అన్నారు. ఈ పోటీలలో మండలం నుండి జిల్లాకు ఆరుగురు విద్యార్ధులు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పి.ఇ.టిలు కొర్రాజులు, కుమారి, పాఠశాల ఉపాధ్యాయులు, సి.ఆర్.పిలు, సి.సి.ఒ మహబూబ్, ఐ.ఆర్.పిలు పాల్గొన్నారు.

Spread the love