Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్ పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈక్ర‌మంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్‌, నల్గొండ‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట‌, రంగారెడ్డి‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట‌, వరంగల్ హన్మకొండ‌, సంగారెడ్డి‌, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -