- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాక్ ప్రభుత్వంపై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు.అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ తో పాకిస్థాన్‌కు వైరం ఉందని, దీంతో శాంతి చర్చలకు విఘాతం కలుగుతుందని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అయితే, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీన్ని తోసిపుచ్చారు.
- Advertisement -



