గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించకుండా చూడాలి..

– సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నీ కలిసి వినతి పత్రం అందజేసిన కేడి దినేష్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మించకుండా చూడాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీనీ కలిసి  విజ్ఞప్తి చేసిన టిడిపి పార్టీ  రాష్ట్ర వాణిజ్య శాఖ కార్యదర్శి కేడి దినేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తే లక్షలాది మంది ఇబ్బందులు పడతారని అన్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ను సీపీఐ(ఎం) పార్టీ సందర్శించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్  కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు
Spread the love