ప్రజల దాహార్తిని తీర్చుతున్న సుధాకర్ పీవీసి యాజమాన్యం

– మూడు లక్షలతో పలు కూడళ్లలో చలివేంద్రాలు,
– ప్రయాణికుల నీటి సౌకర్యార్థం రెండు ఆర్వో 
– ప్లాంట్ల ఏర్పాటు
– ప్రజా సేవలో సుధాకర్ పీవీసీ…యండి మీలా మహాదేవ్
నవతెలంగాణ – సూర్యాపేట
వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రజలకు త్రాగునీటి కష్టాలు వెంటాడుతాయి. మండుటెండలో త్రాగడానికి నీళ్లు లభించక ఎందరో నీటి ఇబ్బందులు పడుతున్నారు. కాగా సూర్యాపేట జిల్లా కేంద్రం అయినప్పటి నుండి పట్టణానికి వివిధ ప్రాంతాల నుండి రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో వేసవి ప్రారంభం కాగానే గత ఎప్రిల్, మే,జూన్ నెలలో పట్టణానికి వచ్చే ప్రజలు, బాటసారులు దాహార్తి కోసం అల్లాడేవారు. ఈ నేపథ్యంలో సుధాకర్ పివిసి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యండి మీలా మహాదేవ్ స్పందించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి గాను జిల్లా కేంద్రంలో చలి వేంద్రాల ఏర్పాటు కు ఆయన ముందుకు వచ్చారు. ఇందుకు గాను మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ సుధాకర్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీ వారిని సి.ఎస్ .ఆర్ పథకం క్రింద 8 ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్ధము చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చాలని మీల మహాదేవ్ ను కోరగా వెంటనే స్పందించిన ఆయన మున్సిపాల్టీ వారి కో ఆర్డినేషన్ తో పట్టణంలో చలి వేంద్రాల ఏర్పాటు కొత్త రూ 3.00 లక్షలు కేటాయించారు.కాగా పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి కోసం గాను గత ఎప్రిల్ నెలలోనే జిల్లా కేంద్రంలో చలి వేంద్రాన్ని ప్రారంభించడo జరిగింది.
వివిధ వర్గాలకు దాహార్తి ని తీర్చటానికి గాను సుధాకర్ పివిసి వారి సహాయంతో ఏప్రిల్ ,మే,జూన్ నెలలో మున్సిపాలిటీ వారు పట్టణంలోని ప్రధాన కూడలిలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి  నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి ప్రధానంగా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు,పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో,కూరగాయల మార్కెట్, కొత్త బస్టాండ్ (రాజధాని హోటల్ ముందు),ముత్యాలమ్మ గుడి,పి.ఎస్.ఆర్ .సెంటర్,జమ్మిగడ్డ,ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవిలో ప్రజల దాహర్తి ని తీర్చుతున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు దూర ప్రయాణం చేసే వారి దాహార్తిని తీర్చడానికి గాను మీలా మహాదేవ్ బస్టాండ్ లలో ఆర్వో ప్లాంట్లను..ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే లక్షలాది రూపాయలు వెచ్చించి సూర్యాపేట డిపో పరిధి లో ఉన్న కొత్త బస్టాండ్,హైటెక్ బస్టాండ్ లలో ప్రయాణికుల మంచి నీటి సౌకర్యార్థం కోసం రెండు ఆర్వో  వాటర్  ప్లాంట్లను ఏర్పాటు చేశారు.వేసవి లో బాటసారులు,ప్రయాణికుల దాహార్తి ని తీర్చుతున్న సుధాకర్ పీవీసి యాజమాన్యం పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సుధాకర్ పివిసి యండి మీలా మహాదేవ్ మాట్లాడుతూ ప్రజల సేవలో సుధాకర్ పివిసి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు.
Spread the love