
మండలంలోని రుద్రారం, అద్వలాపల్లి గ్రామాలకు చెందిన గంటి రాజు-లక్ష్మీ నూతన దంపతుల వివాహం బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు.ఈ వివాహానికి తాడిచెర్ల పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ ఎంపిపి చింతపల్లి మలహాల్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అద్యకుడు బడితేల రాజయ్య హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనుణ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజునాయక్, అడ్వాల మహేష్, సురేష్ పాల్గొన్నారు.