నవతెలంగాణ – అచ్చంపేట: ప్రతి మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి వి పర్వతాలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, వర్షాలు ఎక్కడికక్కడ వడగళ్ల వానతో కురుస్తున్నాయి పంటలు తోటలు నష్టపోతున్న ప్రతి రైతుకు ఎగరకు 20000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ 40 శాతం మందికి రుణమాఫీ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొంతమంది సంతోష పడుతుంటే కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్న రైతుబంధు డబ్బులు 4 ఎకరాల లోపే ఇచ్చారని మిగతా వారికి జమగాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అందరికీ రైతు భరోసా జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, దేశా నాయక్, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్ నాగరాజు నిర్మల నాయకులు సైదులు, సయ్యద్బి, రాములు, శివకుమార్ తదితరులు ఉన్నారు.