నవతెలంగాణ – హైదరాబాద్ : కరాచీ రేంజర్స్ కార్యాలయంపై ఉగ్రదాడి తర్వాత పాక్ – అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కరాచీ దాడి జరిగిన తర్వాత రోజే అప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి, 29 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ వెల్లడించింది. అయితే, ఈ దాడుల్లో సాధారణ పౌరులు కూడా మృతిచెందారని అప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ తూర్పు అప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ దాడులు చేసిందని వెల్లడించారు. ఈ దాడుల్లో సాధారణ పౌరులే ఎక్కువ మంది మృతిచెందారని, అనేకమంది గాయపడ్డారని తెలిపారు. పాక్ చేసిన ఈ దాడులను పిరికిపంద చర్యగా అప్ఘనిస్థాన్ పేర్కొంది.
పాక్ వైమానిక దాడులు..అప్ఘనిస్థాన్ లో 29 మంది మిలిటెంట్లు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



