Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని వినతి

రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెనుక ఉన్న గల్లీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో రోడ్లు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో పాటు పాములు సంచరిస్తుండటంతో కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, పత్రికల ద్వారా మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి, వెంటనే స్పందించి సి.సి రోడ్ సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి, అలైన్మెంట్ సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని 20వ వార్డు కాలనీవాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -