బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ 
నవతెలంగాణ  – తిరుమలగిరి
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగనన నిర్వహిస్తామని రాష్ట్ర సచివాలయంలో జరిగిన బిసి, సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాడాని స్వాగతిస్తున్నామని బీసీ కులగణన పై ప్రభుత్వం జాప్యం చేయకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లోపే కులగణన పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  తన్నీరు రాంప్రభు ఇంటిలో  జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోను మరియు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే రాష్ట్రంలో బీసీ కులగనన చేపడుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు.బీసీ కుల గణన ను వెంటనే ప్రారంభించాలంటే బీసీ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ లొ నిర్ణయం తీసుకొని అవసరమైతే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా బీసీ కులగణను ఈ లోక్ సభ  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపునే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని కులగలనను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాజుల విజ్ఞప్తి చేశారు.బీసీ కుల గణనను చేపట్టాలని ఇప్పటికే తాము ఈనెల 13వ తేదీన ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమై ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రెండు మార్లు స్వయంగా కలిసి బీసీ కులగనన చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించామని ఆయన తెలిపారు. దాని పర్యవసానంగా ఆదివారం బీసీ కులగనను చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అన్నారు.ఇప్పటికే దేశంలో బిహర్ రాష్ట్రంలో కులగనను పూర్తి చేశారని,ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం బీసీ కులగనణ  కొనసాగుతుందని, మూడవ రాష్ట్రంగా తెలంగాణలోనూ బీసీ కులగనన చేపట్టడం మంచి విషయం అన్నారు. కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచిన తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు ,బీసీ నాయకులు కొత్త గట్టు మల్లయ్య , జాజుల లింగం,  కాసాని శ్యామ్ యాదవ్,వంగరి బ్రహ్మం, అంబటి మహేష్ గౌడ్, తాళ్లపల్లి  లింగయ్య గౌడ్, బత్తిని రాజు గౌడ్, శీలం ఉపేందర్ గౌడ్, ముద్దంగుల యాదగిరి,పులిగిల్ల యాదగిరి, మధు యాదవ్, తరుణ్ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.

Spread the love