మహిళల కోలాటాన్ని విక్షించిన పాండు రంగారెడ్డి

– కోలాటం మహిళకు 10 వేలు ఆర్థిక సహాయం
– ఘన సన్మానం చేసిన మహిళలు
నవతెలంగాణ – పెద్దవూర
– మహిళల కోలాట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు అంగరంగ వైభవంగా జరిగిన మహిళల కోలాటం మహోత్సవానికి గ్రామ మహిళల ఆహ్వానం మేరకు శ్రీ బుసిరెడ్డి పౌండషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మహిళల కొళాటాన్ని వీక్షించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కోలాటం నేర్చుకొని మహిళలు ఇలా ప్రదర్శించుతుంటే చాలా ఆనందంగా వుందని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఎంతో ధృడ నిశ్చయంతో మీరు నేర్చుకుంటూ, మీ తోటి వారిని ఎంకరేజ్ చేస్తూ, వారిని ముందుకు తీసుకుపోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. రానున్న కాలంలో నేను మీకు అండగా వుంటానని, ఇంకా మున్ముందు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే కోలాటం ఆడే మహిళలకు బుసిరెడ్డి పాండురంగారెడ్డి పదివేల రూపాయలు బహుమతి గా ఇచ్చారు. అనంతరం మహిళలు ఆయనను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, యంపీటీసీ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ ఉడ్తూరి రామంజిరెడ్డి, అల్గుల బ్రహ్మరెడ్డి, ఉడ్తూరి కోటిరెడ్డి, అల్గుల రమణారెడ్డి,అల్గుల కృష్ణారెడ్డి, అల్గుల వెంకటరెడ్డి,సద్దల గోవిందరెడ్డి,పంగ లక్ష్మణ్,పంగ గోవిందు, మేకల సతీష్, ఛైర్మన్ వెంకటరెడ్డి, పాతనబోయిన సురేష్, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, నర్సింగ్ సైదులు, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, నితిన్, పాతనబోయిన కోటయ్య, మల్లిఖార్జున చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love