విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పార్టీలను ఓడించాలి..

నవతెలంగాణ -ఆర్మూర్
విద్యారంగాన్ని, ఉపాధిరంగాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని పి.డి.ఎస్.యూ  డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్, పి.వై.ఎల్ ఆధ్యక్షులు ఎస్. వెంకటేష్ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. బీజేపీ ఈ సందర్భంగా  పట్టణ కేంద్రం పిడిఎస్యూ కార్యాలయంలో   బుధవారం స్టూడెంట్ యూత్ మేనిఫెస్టోను పి.డి.ఎస్.యూ,పి.వై.ఎల్  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో  విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజం సామాజిక, సంస్కృతిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, అసమానతలు తొలగాలంటే విద్య, వైద్యం ఉపాధి కీలకమైనవాని .కానీ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ రంగాలను గాలికి వదిలేసాయి, నిర్లక్ష్యం చేశాయి. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించాయని. కాబట్టి యువత విద్యార్థులు బిఆర్ఎస్,బిజెపి  పార్టీలను ఓడించమని పి.డి.ఎస్.యూ ,పి.వై.ఎల్  పిలుపునిస్తుంది. కాబట్టి క్రింది డిమాండ్ల సాధన కోసం పాలకవర్గ పార్టీలను నిలదీయాలని ,వీటి కోసం పోరాడాలని కోరుతున్నది. ప్రభుత్వ రంగంలో విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ ఉచితంగా అందించాల నీ  జిల్లాకు ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలిరాష్ట్రంలో ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేయాల నీ. రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాల నీ.  విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాల నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో రద్దు చేయాలనీ యూనివర్సిటీ లలో  విద్యార్థి ఎన్నికలు నిర్వహించా నాని యూనివర్సిటీలను రద్దు చేయాల నీ మండలానికి ఒక్క జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికి రెండు రెండు కాలేజీలు, జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాల నీ, హాస్టల్ విద్యార్థులకు 5000 మెస్ చార్జీలు, 1000 రూపాయల కాస్మోనిక్ చార్జీలు ఇవ్వాల నీ ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలన, నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాల నీ  ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 5000 ఇవ్వాలని మేనిఫెస్టో విడుదల చేసినారు.
Spread the love