గణనాథుని నవ రాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామాన ప్రజలు అంబారాన్ని అంటేలా సంబరాలను జరుపుకుంటుండగా శనివారం ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మైలారం, కేశవాపురం, ఎర్ర కుంట తండా, కిష్టాపురం, వెంకటేశ్వర పల్లి, సన్నూరు, పనీస్ తండాల్లో గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్క గణపతి కమిటీకి ఐదువేల రూపాయలు చందాలుగా ఇచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ప్రజా సేవ చేయడానికే ముందుకు వచ్చినట్లు తెలిపారు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగం ప్రజాసేవ చేయడానికి కంకణబద్ధులైనట్లు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో యువకులు ఐకమత్యంగా ఉంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. పాఠశాలలకు, దేవాలయాలకు, పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, సురేందర్ నాయక్, సుధాకర్, గబ్బెట బాబు, చిర్ర శ్రీధర్, భిక్షపతి, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.