ఎస్ఎఫ్ఐ నిర్వహించే 10వ తరగతి టాలెంట్ టెస్ట్ ని విజయవంతం చేయండి

– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు
నవతెలంగాణ-  నెల్లికుదురు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 9వ ,పదవ తేదీలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించబోయే టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు అన్నారు. మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శనివారం సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు భయంను ప్రారదోలి వారిలో ఉన్న  ప్రతిభను వెలికితీయడానికే ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఈనెల తొమ్మిదవ పదవ తేదీలలో నిర్వహించబోయే టాలెంట్ టెస్ట్ ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ టాలెంట్ టెస్ట్ పదవ తరగతి వారికి ఉపయోగంగా ఉంటుంది అని అన్నారు. ఈ కశ్చన్ పేపర్ ని మేదావుల చేత తయారు చేయబడుతుంది అని తెలిపారు. ఇందులో జిల్లా స్థాయి లో ప్రధమ ,ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఎస్ఎఫ్ఐ అంటే పోరాటాలే కాదు విద్యార్థులను విద్యలో చైతన్యపరిచేందుకు ఈ టాలెంట్ టెస్టులు తో పాటు కొన్ని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తుందని అన్నారు. కనబరిచిన వారి పట్ల అభినందనీయ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు.ఈ టాలెంట్ ‌ప్రతిభ కనబరిచి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు‌‌. మరిన్ని వివరాలకు 9948154021 ఈ సెల్ నంబర్ ని సంప్రదించగరు అని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు మహేష్, వినయ్, ప్రవీణ్, యశ్వంత్ పాల్గొన్నారు.
Spread the love