
నవతెలంగాణ – బెజ్జంకి
గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు కుల, మత, వర్గ విభేదాలేకుండా ఎల్లవేళల సమ సమాజ సేవకోసం పవనపుత్ర యువజన సంఘం నిర్మాణం చేసుకున్నామని సభ్యులు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని గూడెం గ్రామంలో పవనపుత్ర యువజన సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించుకున్నారు. నూతన అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి,కోశాధికారిగా దొంతి హరీశ్, యాలాల పర్శరాములు, బీమ్ రెడ్డి అమరేందర్ రెడ్డి, యాలాల శివ కుమార్, సందవేని వెంకటేశ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా నియామకమైన ప్రధాన కార్యవర్గాన్ని సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.